Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీం రీకార్దు సృష్టించాడు. కేవలం 60 బంతుల్లోనే 100 పరుగులు చేయడం విశేషం. దీనిలో 14 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆటగాడిగా ముష్ఫికర్ రహీం రికార్డు నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ వన్డే కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు.