Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఆర్మూర్ : 75 రూపాయల నుండి పింఛన్ తీసుకుంటున్న పట్టణంలోని పెర్కిట్ కు చెందిన రాజమణి నేడు అధికారుల తప్పిదంతో పింఛన్ కు దూరం అయింది ..వివరాలు ఇలా ఉన్నవి.....
మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో గల నల్ల రాజమణి 35 చిన్నప్పటినుండి వికలాంగురాలు ఆమెకు కృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది వీరిద్దరికీ పాప పుట్టిన తర్వాత భర్త మరణించడం జరిగింది. తాను చిన్నప్పటి నుండే వికలాంగురాలు అవడం వలన మునుపటి ప్రభుత్వం ఆమెకు పింఛన్ ఇచ్చి సహకరించిందని తనంతరం తాను గత పది సంవత్సరాల నుండి అధికారుల తప్పిదం వలన పింఛన్ కి అనర్హులుగా ప్రకటించడంతో గత పది సంవత్సరాల నుండి భర్త మరణించడంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ సన్నగించడం మూలాన పాప పోషణ భారంగా మారిందని తాను ఉంటున్న ఇంటి అద్దె కట్టుకోవడం ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ మరియు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తన పైన దయతలిచి పింఛన్ ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని అభ్యర్థించడం జరిగింది. గతంలో సదరం క్యాంప్ లాంటి ఎన్నో సెంటర్లకు పోయిన అధికారుల నిర్లక్ష్యం వలన తనకు న్యాయం జరగలేదని వేదన వ్యక్తం చేసింది .ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తన గోడు అభ్యర్థనను స్వీకరించి తనకు పింఛన్ మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిన అభ్యర్థిస్తున్నట్టుగా నవ తెలంగాణకు తెలిపింది