Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి.. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి.. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60,100కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో రూ.58,700 వద్ద ముగిసిన పసిడి ధర సోమవారం భారీగా పెరిగింది. ఇక ఎంఎసీఎక్స్‌పై కూడా తొలిసారి రూ.60 వేల మార్క్‌ను తాకింది. అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌కు ట్రేడర్లు మొగ్గుచూపుతుండడం ధరలకు రెక్కలొచ్చేందుకు కారణమవుతోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్లు పెంపు వంటి పరిణామాలు కూడా బంగారం భగభగలకు కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి విలువ పతనం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోందని చెబుతున్నారు. మరోవైపు వెండి ధర సోమవారం భారీగా పెరిగింది. ఒక కేజీపై రూ.1860 మేర పెరిగి రూ.69,340కు చేరింది.