Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నివాసంలో నేడు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నాయుడు ఇంట ప్రతి సంవత్సరం ప్రముఖుల సమక్షంలో నూతన సంవత్సరాది వేడుకలను ఘనంగా జరుపుకోవడం అనవాయతీగా వస్తుంది.
ఈసారి వెంకయ్య ఇంట ఉగాది వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ తదితరులతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ అహ్మద్, రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు వెంకయ్యనాయుడు పరిచయం చేసారు. బహుభాషా కోవిదునిగా యార్లగడ్డ దేశ ప్రజలకు సుపరిచితులని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా సేవలు అందించారని వివరించారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో తామిద్దరం కలిసి పనిచేసామని గవర్నర్ కు వెంకయ్యనాయుడు తెలిపారు.