Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి భువనగిరి : ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా తిరుగాడే చిన్నారి విద్యార్థి 1తరగతి చదువుతూ తాను చదువుతున్న స్కూలు బస్సులో నుండి ప్రమాదవశాత్తు జారిపడి బస్సుటైరు పైనుండి వెల్లండంతొ సంఘటన స్థలంలోనే వడ్డెమొని అభిలాష్(8)దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని భీమనపల్లి గ్రాశివార్లలో సోమవారం జరిగింది. పోలిసుల, భందువుల వివరాల ప్రకారం మండలంలోని హైదర్ పూర్ గ్రామానికి చెందిన వడ్డెమొని శ్రీనివాస్రాణి దంపతుల రెండవ కుమారుడు అభిలాష్ పోచంపల్లిలోని లిటిల్ప్లవర్ పాఠళాలలో1తరగతి చదువుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడి ముగియడంతో విద్యార్థులు మధ్యహన్నం స్కూల్ బస్సులో ఇండ్లకు బయలు దేరారు. బస్సు భీమనపల్లి గ్రామశివార్లలో చేరుకోగానే బస్సుడోరు మూసుకోక పోవడంతో వేగంగా వెలుతున్న బస్సులోనుండి అభిలాష్ జారిపడడం వెనకటైరు అతని పైనుండి వెలడ్లం రెప్పపాటులో జరిగి పోయింది. కాగ పొట్టపై తీవ్రగాయాలై రక్తస్రావం జరిగి సంఘటన స్థలంలోనే అభిలాష్ మృతిచెందాడు. కాగ తల్లితండ్రుల రోదనలు మిన్నటాయి, అభిలాష్ మృతితో హైదర్ పూర్ గ్రామంలో విశాదఛాయలు నెలకొన్నాయి. కాగ పోలీసులు పంచనామా నిర్వహించి పోష్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి తండ్రి ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు.