Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఇంగ్లిష్ వైద్యాన్ని మరోమారు టార్గెట్ చేశారు. అల్లోపతి వైద్యంలో కేన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్స లేదని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యంతో వీటిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ రిషికుల్ ఆయుర్వేద కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆవు పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందన్న ఆయన వాటితో చాలా వరకు రోగాలను నయం చేయవచ్చన్నారు. గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో కేన్సర్ వంటి వ్యాధులను తమ సంస్థలో నయం చేసినట్టు రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్, ఆయుర్వేద వర్సిటీ వైస్ చాన్సలర్ సునీల్ జోషి తదితరులు హాజరయ్యారు. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.