Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. సోమవారం దాదాపు పదిన్నర గంటల పాటు కవితను విచారించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేస్తూ ఇడి కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత పది గంటల తర్వాత రాత్రి 9.14 గంటల సమయంలో బయటికొచ్చారు. 9.25 గంటలకు ఢిల్లీలోని సిఎం కెసిఆర్ నివాసానికి చేరుకుని తన కోసం వేచి చూస్తున్న నాయకులు, కార్యకర్తలకు విజయచిహ్నం చూపిస్తూ లోనికి వెళ్లారు. ఉదయం ఇడి ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఎంత ధీమా, ధైర్యంతో వెళ్లారో.. అదే స్థైర్యంతో చెరగని చిరునవ్వుతో ఇంటికి చేరుకున్నారు. ఆమె బయటికి వచ్చేదాక తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొన్నది. అయితే సోమవారం సుదీర్ఘంగా కవితను విచారించిన ఇడి అధికారులు మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కవితకు చెప్పినట్లు సమాచారం.