Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాళ్ల వాన ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం లేదా గురువారం రాళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో రాళ్ల వాన వల్ల వాటిల్లిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికలను పరిశీలించి, నిర్ణయం తీసుకుని ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాలో పర్యటించనున్నారు.