Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలని పిటిషన్ దాఖలైంది. అభ్యర్థులతో పాటు ఎన్ఎస్యుఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరుపున వాదించేందుకు నేషనల్ ఎన్ఎస్యూఐ లీగల్ ఇంఛార్జి వికాస్ దన్కే ఢిల్లీ నుంచి రానున్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని పిటిషనర్లు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తముందని పిటిషనర్లు ఆరోపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత మరో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సుచరిత కోరారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది.