Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ వద్ద ఏసీ కోచ్‌కు ‘హాట్ యాక్సిల్’ అయ్యింది. రైల్వే సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని గుర్తించి ఆ బోగీని తొలగించారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బిట్రగుంట స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. మరమ్మతులు చేయడంతో తిరిగి ఉదయం 4 గంటల తర్వాత రైలు బెంగళూరుకు బయల్దేరింది. ఈ తరుణంలో మరమ్మతుకు గురైన ఏసీ బోగీలోని కొందరు ప్రయాణికులను పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.