Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, 'హ్యారీ పోటర్' ఫేం పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని రైల్వే స్టేషన్ వెలుపల కుప్పకూలి మరణించాడు. ది గార్డియన్ అందించిన వివరాల ప్రకారం.. మార్చి 16వ తేదీన నార్త్ లండన్‌లోని కింగ్స్ క్రాస్ స్టేషన్ వెలుపల పాల్ గ్రాంట్‌ను పోలీసులు కనుగొన్నారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాల్ గ్రాంట్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాల్ గ్రాంట్.. నేడు తుదిశ్వాస విడిచారు. పాల్ గ్రాంట్ మృతి వార్త తెలుసుకున్న పలువురు హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.
పాల్ గ్రాంట్ 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హ్యారీ పోటర్, స్టార్ వార్స్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయనకు భార్య మారియా డ్వయ్యర్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.