Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 445.73 పాయింట్లు లాభపడి 58,074.68 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 119.10 పాయింట్లు లాభపడి 17,107.50 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.64గా ఉంది. రిలయన్స్, టైటన్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి. విప్రో, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.