Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.118 లక్షల కోట్ల బడ్జెట్‌ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ మళ్లీ సమావేశమైన వెంటనే, ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా ప్రొసీడింగ్స్‌కు అధ్యక్షత వహించిన రాజేంద్ర అగర్వాల్ బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ శర్మను కోరారు. బడ్జెట్‌ను ఆమోదించే ప్రక్రియ ప్రారంభించిన తర్వాత జుగల్ కిషోర్ శర్మ ఒక నిమిషం పాటు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించారు.