Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డీసీఎం నడుపుతున్న హోంగార్డ్‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో ఆ వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో డీసీఎంలో ఉన్న ఎస్ఐ చాకచక్యంగా వ్యవహరించి 16 మంది ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ సమీపంలో చోటు చేసుకుంది.
ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. ఖైరతాబాద్ మీదుగా బంజారాహిల్స్ పీఎస్ కు తరలిస్తుండగా, డీసీఎంను నడుపుతున్న హోంగార్డు రమేశ్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో వాహనం డివైడర్ ఎక్కింది. ఇదే వాహనంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి అప్రమత్తమై కిందకు దూకి వాహనాన్ని కంట్రోల్ చేశారు. దీంతో 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, కానిస్టేబుల్ సాయి కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా పోలీసులు అప్రమత్తమై ఎస్ఐ, కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డు రమేశ్‌ను సమీపంలో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.