Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రష్యా
ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి చిన్న పిల్లలను బలవంతంగా రష్యా తరలించారన్న ఆరోపణలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తెలిసిందే. దీనిపై రష్యా భద్రతామండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ ఘాటుగా స్పందించారు. హైపర్ సోనిక్ క్షిపణితో కోర్టు భవనంపై దాడి చేస్తామంటూ తీవ్ర హెచ్చరిక చేశారు.
"అందరు కూడా దేవుడికి, మిస్సైళ్లకు జవాబుదారీగా ఉంటారు... ఉత్తర సముద్రంలోని రష్యా యుద్ధ నౌక నుంచి హేగ్ లోని ఓ భవనం (అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం)పైకి హైపర్ సోనిక్ క్షిపణి దాడి జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అంటూ బెదిరించారు. "దూసుకువచ్చే మిస్సైల్ కోసం ఆకాశాన్ని గమనిస్తుండండి" అంటూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిలకే వార్నింగ్ ఇచ్చారు.