Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఢిల్లీ మాజీ ఉప ముక్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మంగళవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయగా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఇటీవల కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తునకు సిసోడియా సహకరించారని, అయితే తనపై నేరారోపణ చేసే విషయాలను వెల్లడించిందలేదని తెలిపారు. అలాగే బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా కస్టడీ సైతం అవసరం లేదని, పారిపోయే అవకాశం లేదన్నారు. బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు కేసులో సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని వాదించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచింది.