Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల నుంచి తొలగించారు. వనపర్తి జిల్లా గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్‌గా పని చేస్తుంది. డాక్యానాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంచల్‌గూడ మహిళా జైల్లో రేణుక ఉంటున్న విషయం తెలిసిందే. డాక్యానాయక్ కూడా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నాడు. పేపర్ లీక్ కేసులో ఏ3గా రేణుక, ఏ4గా డాక్యా నాయక్ పేర్లను పోలీసుల చేర్చారు.