Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో గెలుపుతో టోర్నీని ముగిద్దామని భావించిన ఆర్సీబీ వుమెన్కు నిరాశే ఎదురైంది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది.
తొలి వికెట్కు హేలీ మాథ్యూస్(24 పరుగులు), యస్తికా బాటియా(30 పరుగులు) 50 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ అవ్వడం.. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ట్రాక్ ఎక్కినట్లే కనిపించింది. కానీ అమేలియా కెర్(31 నాటౌట్) పూజా వస్త్రాకర్(19 పరుగులు) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి జట్టును గెలిపించింది. ఆర్సీబీ బౌలింగ్లో కనికా అహుజా రెండు వికెట్లు తీయగా శ్రేయాంక్ పాటిల్, ఎల్లిస్ పెర్రీ, మేఘన్ స్కా్ట్, ఆశా శోభనా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ సేన 8 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.