Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ రోజు ఉదయం నుండి ఏడున్నర గంటలుగా కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. కాసేపటి కిందట కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సోమాభరత్ కుమార్‌తో పాటు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈడీ అడిగిన పత్రాలను వాళ్లు సమర్పించినట్లు తెలుస్తోంది.