Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తాను అస్వస్థతకు గురయ్యానంటూ నటి పాయల్ రాజ్‌పుత్ అభిమానులకు షాక్ ఇచ్చారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకిందని, ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చికిత్స తీసుకున్నప్పటి ఫొటో షేర్ చేశారు. ‘‘నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్కు గురైంది. ఈ సందర్భంగా నీరు ఎక్కువగా తాగాలని మీ అందరికీ గుర్తుచేస్తున్నా. ప్రస్తుతం యాంటిబయోటిక్స్ చివరి డోస్ తీసుకున్నా. అంతా సెట్ అయింది. మనకెదురైన అవాంతరాలను అధిగమించగలగాలి. ఎంత ఇబ్బంది ఉన్నా నా తదుపరి సినిమా చిత్రీకరణను మాత్రం నేను ఆపలేదు. ఆ ప్రాజెక్టు నాకెంతో ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్‌లోని రామచంద్రాపురం పరిసరాల్లో జరుగుతోంది. సూపర్‌హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్- అజయ్ కాంబోలో రూపొందుతుండడంతో ‘మంగళవారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విభిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది.