Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యూపీ వారియర్స్ నాలుగో వికెట్ పడింది. కిరణ్ నవగిరే (2)నాలుగో వికెట్‌గా వెనుదిరిగింది. జొనాసెన్ ఓవర్లో ఫ్రంట్ ఫుట్ వచ్చింది. బంతిని అందుకున్న తానియా భాటియా వికెట్లను గిరాటేసింది. తహ్లియా మెక్‌గ్రాత్(19), దీప్తి శర్మ క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు యూపీ నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. 71 రన్స్ వద్ద సిమ్రాన్ షేక్ (11) ఔట్ కావడంతో యూపీ మూడో వికెట్ కోల్పోయింది. అలిసా హీలీ (36)ను అలిసే క్యాప్సే రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. 30 రన్స్ వద్ద యూపీ వారియర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శ్వేతా షెరావత్(19) రాధా యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యింది.