Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను రాత్రి 8గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. ఇవాళ్టికి కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. కవితను విచారిస్తున్న సమయంలో భారాస లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్‌ను కార్యాలయానికి పిలిచారు. కవితకు సంబంధించిన ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిచినట్టు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్‌ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్‌కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో.. విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.