Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలలోని గొర్రెపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి విష్ణు(30) మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్లో పాల్గొంటున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన తోటి క్రీడాకారులు చికిత్స కోసం మెట్పల్లి ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి తల్లి సరోజన గొర్రెపల్లి సర్పంచిగా కొనసాగుతున్నారు.