Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.5వేల కోట్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎంకు పంపించిన లేఖ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలలో ఉన్న లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈ పథకాన్ని ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోవడానికి తీసుకొచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని కొనసాగిస్తుండడం సంతోషకరమే కానీ, సమయానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్లే కొన్ని యాజమాన్యాలు కళాశాలలను మూసేశాయన్నారు. ఇంకొన్ని యాజమాన్యాలు కళాశాలలను నడుతుపుతున్నా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.