Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వార్షిక 'ప్రతిభా పురస్కారాల'ను మంగళవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసింది. డా.వై.రామకృష్ణారావు (కవిత), డా.లింగంపల్లి రామచంద్ర (విమర్శ), సాజిద్ బిన్ అమర్ (చిత్రలేఖనం), ఎం.వి.రమణారెడ్డి (శిల్పం), డా.వేదాంతం రామలింగశాస్త్రి (నృత్యం), ధూళిపాళ శ్రీనివాస్ (సంగీతం), దామెర్ల సాయిబాబా (పత్రికారంగం), బబ్బెళ్లపాటి శ్రీగోపాలకృష్ణసాయి (నాటకం), కిన్నెర బ్రహ్మయ్య (జానపద కళారంగం), డా.చిర్రావూరి శివరామకృష్ణశర్మ (అవధానం), డా.బండ సరోజన (ఉత్తమ రచయిత్రి), విహారి (నవల/కథ) పురస్కారాలకు ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ నెల 31న జరిగే ప్రత్యేక వేడుకలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారని తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో ప్రదానం చేసే రంగస్థల యువపురస్కారాన్ని 2022-2023 సంవత్సరానికి గోలి శివరాంరెడ్డి (గోలి రాము)ని ఎంపిక చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ పురస్కారాన్ని మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున ఎన్టీఆర్ కళామందిరంలో ప్రదానం చేస్తారు.