Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన మూడో వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. చెరోటి గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ సమమైన సిరీస్లో ఆఖరి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన స్మిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుని భారత జట్టుకు బౌలింగ్ అప్పగించింది. ఇక దాదాపు మూడేండ్ల తర్వాత చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండడంతో.. ఈ మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.