Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీపై సర్వత్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద కనిపించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు టీఎస్పీఎస్సీ కార్యాలయం గోడకు ఈ పోస్టర్లను అంటించారు. ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ ప్రశ్నాపత్రాలు లభిస్తాయని వ్యంగ్యంగా పోస్టర్లపై రాసి ఉంది.
పోస్టర్ లో ఏముందంటే?
‘తప్పు చేసిన టీఎస్పీఎస్సీని రద్దు చేయకుండా, కేవలం పరీక్షను రద్దు చేయడమేంటీ? శిక్ష ఎవరికి బోర్డుకా? విద్యార్థులకా?.. ‘ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.. ముఖ్యమంత్రి గారు.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. టీఎస్పీఎస్సీ పేపరు లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే సీబీఐకి అప్పగించి టీస్పీఎస్సీ బోర్డును మరియు సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి. నస్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచే నెలకు 10,000/-రూ. చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి’ అని ఉంది.