Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తొలి రెండు వన్డేల్లో ఏమంత ప్రభావం చూపని హార్దిక్ పాండ్యా ఆసీస్ తో చివరి వన్డేలో నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. చెన్నైలో టీమిండియాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓ దశలో భారీ స్కోరుపై కన్నేసినట్టే కనిపించింది. అయితే హార్దిక్ పాండ్యా బంతిని అందుకోవడంతో పరిస్థితి మారిపోయింది.
తొలుత ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (33)ను అవుట్ చేసిన పాండ్యా ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0)ను డకౌట్ చేయడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత విధ్వంసక ఫామ్ లో ఉన్న ప్రమాదకర ఆటగాడు మిచెల్ మార్ష్ (47)ను పాండ్యా ఓ చక్కటి బంతితో బౌల్డ్ చేశాడు. దాంతో ఆసీస్ కేవలం 17 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 19 ఓవర్లలో 3 వికెట్లకు 103 పరుగులు. డేవిడ్ వార్నర్ 14, మార్నస్ లబుషేన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.