Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సిసోడియాను ఈడీ నేడు కోర్టులో హాజరుపరచగా ఆయన కస్టడీని కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మనీశ్ సిసోడియాకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో, ఆయనను అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్ ఎదుట హాజరుపరిచారు. అయితే, తన జ్యుడీషియల్ కస్టడీ సమయంలో కొన్ని మతపరమైన, ఆధ్యాత్మిక పుస్తకాలను తీసుకెళ్లడానికి అనుమతించాలని సిసోడియా కోర్టును కోరారు. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాతే అనుమతిని అనుమతిస్తామని కోర్టు కోరింది.