Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక లైంగికదాడికి గురై, ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. లైంగికదాడి కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ ఆధ్వర్యంలోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో సవాలు చేశారు.