Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రోగ్రాం 'మన్ కీ బాత్' 100వ ఎడిసోడ్ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది. 'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు గ్లోబల్ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా 'మన్‌కీ బాత్' కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం'' అని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రధాన మంత్రి మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఘనవిజయం సాధించేందుకు వీలుగా లక్షకు పైగా బూత్‌లలో దీనిని టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. 2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనప్పటికీ ఏమాత్రం గుర్తింపునకు నోచుకోని వారి సేవలను మన్ కీ బాత్ ద్వారా తెలుపుతున్నారు. వీటితో పాటు వాతావరణ మార్పులు, వ్యవసాయం, కళలు, సంస్కృతి, ఆరోగ్యం వంటి అంశాలు సందర్భానుసారంగా ఈ ప్రోగ్రాంలో చోటుచేసుకుంటున్నాయి.