Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సికింద్రాబాద్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 మధ్యకాలంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు.
అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 22 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష నిర్వహించింది. ఈ తరుణంలో ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఈవెంట్స్‌ను పూర్తిచేసి మొత్తం 7,305మందితో అభ్యర్థుల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. దీంట్లో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులకు ఎంపికైన వారి నంబర్లు ఉన్నాయి.