Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (47) రాణించగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (0) డకౌటయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అలెక్స్ కెరీ (38) ఫర్వాలేదనిపించాడు. మార్నస్ లబుషేన్ (28), సీన్ అబాట్ (26), స్టాయినిస్ (25), డేవిడ్ వార్నర్ (23), అగర్ (17), మిచెల్ స్టార్క్ (10*), ఆడమ్ జంపా (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్దీప్ పాండ్య చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకోగా.. అక్షర్ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.