Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశంలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నాడు అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కోవిడ్ పరిస్థితి, ప్రజారోగ్య సన్నద్ధతపై ఈ సమావేశంలో మోడీ సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, పీఎంఓ కార్యాలయం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఒక్క రోజు 1,134 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,000కు చేరుకుంది. మృతుల రేటు 1.19 శాతంగా నమోదైంది.