Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాలలో ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. పద్మ అవార్డులు 2023 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించబడ్డాయి. 106 మంది గ్రహీతలలో తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్, ఆర్ఆర్ఆర్ చిత్రం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, నటి రవీనా టాండన్ ఉన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఏపీకి చెందిన చింతల పాటి వెంకటపతి రాజు( కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావు (వైద్య రంగం విభాగంలో ), బి.రామకృష్ణారెడ్డి(సాహిత్యం) పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి అందజేసిన పద్మ అవార్డుల జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.