As forwarded 👇😁
— KTR (@KTRBRS) March 22, 2023
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!
అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
Authorization
As forwarded 👇😁
— KTR (@KTRBRS) March 22, 2023
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!
అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!
నవతెలంగాణ - హైదరాబాద్
ఉగాది పండుగ వేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. ఇరువురు మధ్య ట్వీట్టర్ యుద్దం నడిచింది. ‘‘ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి. బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’’ అని కేటీఆర్ ట్వీట్ చేయగా..
ఇదే తరుణంలో బండి సంజయ్ స్పందిస్తూ ‘‘ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి. వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజ పూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. తుస్.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి. పతనం ఇక షురువాయే!!’’ అని ట్వీట్ చేశారు.