Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లండన్
లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టమైంది. బారీకేడ్ల సంఖ్య పెరిగడంతో పాటు భద్రతాధికారుల సంఖ్య పెరిగింది. సెంట్రల్ లండన్‌లోని ఇండియా ప్లేస్‌గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఈ భవనం వద్ద వారంతా విధుల్లో కనిపించారు.
ఢిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం బయట బారికేడ్లను తొలగించిన మరుక్షణమే యూకే ప్రభుత్వం నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు చేసిన దుశ్చర్యను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంపై ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.