Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
గాలి కాలుష్యం కట్టడీకి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాదిలో 1600 బస్సులు కొనుగోలు చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 2025లోగా 10,480 బస్సులు కొనుగోలే లక్ష్యమని వెల్లడించారు.
ఈ తరుణంలో సిటీలోని మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు అందుబాటులో ఉండే విధంగా మెహల్లా బస్సు పథకం తీసుకొస్తున్నామన్నారు. ఇందుకోసం 2023 బడ్జెట్లో 9వేలకోట్లు నిధులు కేటాయించారు. 2025 నాటికి ఢిల్లీలో 10,480 బస్సులను నడిపేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం 7,319 బస్సులు ఢిల్లీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, 2023-24 సంవత్సరంలో 1600 మెహల్లా బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.