Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖలోని కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అన్నాచెల్లి( అంజలి, దుర్గాప్రసాద్), చోటు అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, కొమ్మిశెట్టి శివశంకర, సాతిక రోజారాణి, సున్నపు కృష్ణ ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వెలికి తీస్తున్నారు.
నిన్న ఆ చిన్నారిది పుట్టిన రోజు. అర్ధరాత్రి వరకూ కుటుంబసభ్యులతో ఆనందంగా బర్త్డే వేడుకలు జరుపుకొన్న చిన్నారి తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చెల్లితోపాటే అన్న అన్నట్లు అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. రక్తసంబంధంలోనే కాదు.. మృత్యువులోనూ చెల్లిని వదలలేదు. తల్లిదండ్రులు ఏమో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.