Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చత్తీస్ గఢ్
జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. మీడియా ప్రతినిధులపై హింసను నిరోధించడం, విధులు నిర్వర్తించడంలో ఈ బిల్లు రక్షణ ఇస్తుందని సీఎం అన్నారు.
ఈ చట్టం అమలులోకి వచ్చిన 90 రోజుల్లోపు ‘ఛత్తీస్గఢ్ మీడియా ఫ్రీడమ్, ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఇది మీడియా పర్సన్స్ వ్యక్తిగత నమోదుకు పనిచేస్తుంది. మీడియా వ్యక్తులపై వేధింపులు, బెదిరింపులు, హింస లేదా తప్పుడు ఆరోపణలు మరియు అరెస్టు వంటి మీడియా వ్యక్తుల రక్షణకు సంబంధించిన ఫిర్యాదులను కమిటీ పరిష్కరిస్తుంది. ఈ కమిటీలో ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్/ పోలీస్ అధికారి ఉంటారు. హోం డిపార్ట్మెంట్ నామినేట్ చేసిన ప్రాసిక్యూషన్ బ్రాంచ్ అధికారితో పాటు ముగ్గురు మీడియా వ్యక్తులు ఇందులో ఓ మహిళా కూడా ఉంటారు.