Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది.
అయితే మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే అంటూ 2019లో రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.