Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 5000 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి.
ఈ క్రమంలో మార్చి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మొత్తం ఖాళీల్లో తెలంగాణలో (హైదరాబాద్ 65, వరంగల్ 41 ) ఖాళీల్ని భర్తీ చేయనుండగా ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్లో 41, గుంటూరు 60, విశాఖ 40) భర్తీ చేయనున్నారు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, అర్బన్ శాఖల్లో రూ.12 వేలు, మెట్రో నగరాల్లో రూ.15 వేలు చొప్పున సెంట్రల్ బ్యాంక్ స్టైఫండ్ అందజేస్తుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.centralbankofindia.co.in ని సంప్రదించవచ్చు.