Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మరో 2 రోజులు వడగళ్ల వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పంట నష్టపోయిన రైతులు మళ్లీ వడగళ్ల వానతో ఇంకా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతా ల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా..ఖమ్మం జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సీఎం వెళ్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి పరామర్శించి భరోసా కల్పించనున్నారు. ఖమ్మం పర్యటన అనంతరం మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సీఎం వెళ్లనున్నారు.