Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురికావొద్దు. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నారు. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోంది. దేశంలో రైతుకు లాభం కలిగించే పాలసీలు లేవని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లాలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 10వేల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే కౌలు రైతులు ఉంటే వారికే ఈ పరిహారం చెందేలా ఆదేశాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇంత సాయం చేసిన దాఖలాలు లేవని అన్నారు.