Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలో బీజేపీ బలోపేతానికి పలు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్‌లను నియమించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌లను గురువారం నియమించింది. ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. బీహార్‌కు, సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరి కొత్త రాష్ట్ర చీఫ్‌గా నియమితులయ్యారు.