Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నాంపల్లి కోర్టు ముగ్గురికి రిమాండ్ విధించింది. ఈ కేసులో గురువారం అరెస్టయిన రమేశ్, సురేశ్, షమీమ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందిన షమీమ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 127 మార్కులు, టీఎస్పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్ బృందం గుర్తించింది.
ఈ క్రమంలో లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం తీసుకున్నట్లు షమీమ్ తెలిపాడు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదని చెప్పాడు. దీంతో షమీమ్ ఇచ్చిన ఆధారాల మేరకు వీరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.