Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్ లేఖలు రాశారు. లీకేజీ అంశంలో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో పొందుపరచాలన్నారు.