Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అదీ ఓ న్యాయస్థానం ప్రాంగణంలో కావడం గమనార్హం. తమిళనాడులోని కొయంబత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు 2016లో జరిగిన ఓ చోరీ కేసులో నిందితురాలు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం గురువారం జిల్లా న్యాయస్థానానికి వచ్చారు. కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన ఆమె భర్త శివకుమార్.. పథకం ప్రకారం నీళ్ల సీసాలో యాసిడ్ తీసుకొచ్చాడు. ఆమె కనిపించగానే.. ఒక్కసారిగా ముఖంపై యాసిడ్ పోశాడు. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె అతడి బారినుంచి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ దాడిలో ఆమె మెడ కింద తీవ్రగా కాలిపోయింది. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. దాడి అనంతరం శివకుమార్ కోర్టు నుంచి తప్పించుకునేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకుని, అరెస్టు చేశారు. 'లారీ డ్రైవర్గా పనిచేస్తున్న శివకుమార్, బాధితురాలు దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలోనే వేరే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త దాడికి పాల్పడ్డాడు' అని పోలీసులు తెలిపారు.