Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్కార్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన సన్నిహితులు చంద్ర బోస్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు స్టేజ్ పైకి వెళ్లేటప్పుడు ఉన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్నారు. ఆస్కార్ స్టేజ్ పైన మన తెలుగు పదం నమస్తే తోనే స్పీచ్ ఇచ్చానని తెలిపారు. నాటు నాటు పాట వెనుక తన తొమ్మిది నెలల కష్టం ఉందన్నారు. తెలుగు సినిమా భారతీయ సినిమా ప్రపంచానికి గొప్పగా పరిచయం అయ్యాయి. ఆస్కార్ తో తన బాధ్యత మరింతగా పెరిగిందని చంద్రబోస్ అన్నారు. తాను రాసే ప్రతి పాటను ఆస్కార్ రేంజ్ లోనే ఉండాలని ఇకపై అందరూ అనుకుంటారని చంద్రబోస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు, చిరంజీవి సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఉన్నాయని చెప్పారు.