Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జపాన్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. జపాన్‌లోని ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 28.2 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఇజు ద్వీపం అగ్నిపర్వతాలకు నెలవు. దీంతో అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. రెండు రోజుల క్రితం ఆఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ప్రభావంతో పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో భూమి కంపించింది. దీంతో 16 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌తోపాటు తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భూకంపం సంభవించింది.